జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

పవర్‌గ్రిడ్‌లో 137 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!!

పవర్‌గ్రిడ్‌లో 137 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. వాటి వివరాలు చూద్దాం!

మొత్తం పోస్టుల సంఖ్య: 137 పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)-48, ఫీల్డ్‌ ఇంజనీర్‌(సివిల్‌)-17, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌)-50, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(సివిల్‌)-22. అర్హత: ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)/బీఈ(పవర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.

ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉటర్నులవ్వడంతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 27.08.2021 నాటికి 29ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: ఫీల్డ్‌ ఇంజనీర్లకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000, ఫీల్డ్‌ సూపర్‌వైజర్లకు నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000లతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌(టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్, అప్టిట్యూడ్‌ టెస్ట్‌), పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021
వెబ్‌సైట్‌: https://www.powergrid.in

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •