జాతీయం (National) వార్తలు (News)

సహజీవనం కేసులో రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు.. ??

రాజస్థాన్‌లోని జున్‌జును జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల యువకుడు సహజీనం చేస్తున్నారు. అయితే మహిళకు ఇంతకుముందే చట్టబద్ధంగా మరో వ్యక్తితో వివాహం అయ్యింది. భర్త శారీరక వేధింపులకు పాల్పడుతున్న కారణంగా ఆమె తన నుంచి విడిగా ఉంటూ ఈ యువకుడితో జీవిస్తోంది. ఈ క్రమంలో భర్త, అత్తమామలు మహిళపై నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో తమ జీవితాలకు ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని బాధిత జంట కోర్టును ఆశ్రయించడంతో రాజస్థాన్ హైకోర్టు పెళ్లైన మహిళ, మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేయడం అక్రమమే అవుతుందని తేల్చి చెప్పింది. జస్టిస్‌ సతీష్‌ కుమార్‌ శర్మతో కూడిన ఏకధర్మాసనం తీర్పును వెలువరిస్తూ పోలీసుల భద్రత కోరుతూ ఈ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా తిరస్కరిస్తూ వారికి రక్షణ పొందే అర్హత లేదని పేర్కొన్నారు.

మహిళకు ఇంతకముందే పెళ్లై, ఇప్పటి వరకు విడాకులు తీసుకోని నేపథ్యంలో మరో వ్యక్తితో సహజీవనం చేయడం వివాహేతర సంబంధం కిందకు వస్తుందని, డేటింగ్‌ చేస్తున్న వారికి పోలీసుల భద్రత కల్పించడం అంటే ఇలాంటి సంబంధాలకు పరోక్షంగా అనుమతి ఇవ్వడమే అవుతుందని వ్యాఖ్యానించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •