క్రైమ్ (Crime) వార్తలు (News)

రమ్య హత్యకు ముందుగానే స్కెచ్ వేసిన శశికృష్ణ!!

ఆంధ్ర ప్రదేశ్ లో పట్టపగలే నడిరోడ్డుపై రమ్య అనే దళిత యువతి ప్రేమోన్మాది చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఈ హత్యకు పాల్పడిన నిందితుడు శశికృష్ణను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

రమ్య హత్య క్షణికావేశంలో చేసింది కాదని, ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని, ఈ హత్యకు ముందురోజు శశికృష్ణ రెక్కీ నిర్వహించినట్లు, రమ్య కదలికపై నిఘా పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

అంతకుముందు రమ్య చదివే కాలేజీ వద్ద కూడా నిందితుడు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన బుడంపాడులో రమ్య చదివే కాలేజీవద్దకు వెళ్లాడు నిందితుడు. ఓ స్నేహితుడితో కలిసి ఉదయ బైక్ పై వచ్చిన శశికృష్ణను చూసి భయపడిపోయిన రమ్య కాలేజీలోకి వెళ్లిపోయింది. దీంతో అప్పటికి అక్కడినుండి వెళ్లిపోయిన అతడు తిరిగి సాయంత్రం కాలేజీ వదిలే సమయానికి మళ్లీ కాలేజీ వద్దకు వెళ్లాడు. కానీ అప్పటికే రమ్య వెళ్లిపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడని పోలీసుల విచారణలో తేలింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •