ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

సెప్టెంబర్ లో అందుబాటులోకి రానున్న సింగిల్ డోస్ వ్యాక్సిన్!!

రష్యాకు చెందిన సింగిల్‌ డోస్‌ కరోనా టీకా స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి 56 కోట్ల డోస్ ల టీకాలను పంపిణి చేశారు. ప్రస్తుతం రెండు డబుల్ డోస్ టీకాలను ఇస్తున్నారు. అయితే త్వరలో దేశంలోకి సింగిల్ డోస్ కరోనా టీకా ఇవ్వనున్నారు. రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (RDIF)తో ఒప్పందం చేసుకున్న పనాసియా బయోటెక్‌ స్పుత్నిక్‌ లైట్‌ అత్యవసర వినియోగం కోసం డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి కోరింది. వ్యాక్సిన్‌ ధర రూ.750 ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ను మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ రష్యన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ పరాగ్వేలో 93.5 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ఆర్‌డీఐఎఫ్‌ బుధవారం తెలిపింది. రష్యాలో మే నెలలో అత్యవసర వినియోగ అధికారం పొందిన సమయంలో 79.4 శాతం సామర్ధ్యాన్ని చూపించిందని నిర్ధారణ కాగా మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ సైతం స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ 91.6శాతం ప్రభావంతంగా ఉన్నట్లు తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •