క్రైమ్ (Crime) వార్తలు (News)

రాజస్థాన్‌ జడ్జికి బెదిరింపు లేఖ రాసిన ఆగంతకుడు!!

రాజస్థాన్‌ బూందీ జిల్లా సెషన్స్‌ జడ్జి సుధీర్‌ పారిక్‌ను చంపేస్తానంటూ ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ రాయడంతో అప్రమత్తమైన పోలీసులు న్యాయమూర్తికి భద్రత పెంచారు. హిందీలో రాసిన ఆ లేఖలో జడ్జికి ఆగంతుకుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేసాడు. ‘‘మీ వల్ల న్యాయం జరుగుతుందని ఆశ లేదు. అందుకే మిమ్మల్ని సెప్టెంబర్‌ 13న హత్య చేస్తున్నాం’’ అని, ‘‘మీ ఇంటిని బాంబులతో పేల్చివేద్దామనుకున్నాం. కానీ మీ కుటుంబసభ్యులు మాకు ఎలాంటి హాని చేయలేదు. అందుకే వెనక్కి తగ్గాం. మిమ్మల్ని తుపాకీతో కాల్చి లేదా విషమిచ్చి, వాహనంతో ఢీకొట్టి.. ఎలాగైనా చంపేస్తాం. న్యాయస్థానంలో నిందితుడికి మీరు ఎలా అవకాశమిస్తారో, మేమూ రక్షించుకోవడానికి మీకో అవకాశమిస్తున్నాం. ఈ హత్య గురించి పోలీసులకూ సమాచారమిచ్చాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీస్లు దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •