టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

నేటి నుంచి బెంగళూరు మెట్రోరైలు వేళల పొడిగింపు!!

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీయల్) మెట్రో సర్వీసుల సమయాలను నేటి నుంచి పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు మెట్రో రైళ్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తుండగా కొత్త టైమింగ్‌ల అమలుతో శనివారం మొదలుకొని ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. బైయ్యప్పనహళ్లి, కెంగేరి, నాగసంద్ర, సిల్క్ ఇన్ స్టిట్యూట్ టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో రైలు చివరి సర్వీసు 9.30 గంటలకు బయలుదేరుతుంది.

రద్దీ సమయాల్లో ప్రతీ 5 నిమిషాలకు, వారంరోజుల్లో ప్రతి 10 నిమిషాలకు మెట్రో రైళ్ల సర్వీసులు నడుపుతామని అధికారులు వివరించారు.సిల్క్ ఇనిస్టిట్యూట్ కెంగేరి మెట్రో స్టేషన్‌ల మధ్య రైలు సర్వీసుల ఫ్రీక్వెన్సీ ప్రతి 10 నిమిషాలకు అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. మెట్రోరైలు ప్రయాణికులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ప్రయాణం చేయాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •