అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

తాలిబన్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు!!

అఫ్గాన్‌లో తాలిబన్ల వాహనాలను లక్ష్యంగా చేసుకుని శనివారం వరుస పేలుళ్లు జరిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో నంగర్‌హార్‌ ప్రావిన్స్‌ రాజధాని జలాలాబాద్‌లో ఈ దాడి చోటుచేసుకుని రోడ్డు పక్కన మందు పాతరలు అమర్చడంతో అవి పేలాయి. మృతుల్లో ఇద్దరు తాలిబన్లు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఈ విషయంపై స్పష్టత లేదు. 20 మంది క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పౌరులే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పేలుళ్లకు ఇంతవరకు ఎవరూ బాధ్యత వహించలేదు. మరోవైపు కాబుల్‌లోనూ ఓ బాంబు పేలి, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై కూడా పూర్తి వివరాలు తెలియలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •