వార్తలు (News)

ఏపిలో నైట్‌ కర్ఫ్యూ పొడిగించిన ప్రభుత్వం!!

ఏపిలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఏపి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. దీంతో రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని సూచిస్తూ, రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు రాష్ట్ర ప్రజలను కోరారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •