టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం!!

శాసనసభలో ఈ నెల 13వ తేది మానవ వనరుల అభివృద్ధి శాఖ పద్దుపై జరిగిన చర్యల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 32 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు ఒక జీవోను విడుదల చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా పోటీపరీక్షల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో నేరుగా ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయో పరిమితి రెండేళ్లు పెంచనున్నట్లు వెల్లడించారు. 30 ఏళ్ల వరకు ఉన్న వయోఃపరిమితిని 32 ఏళ్లుగా పెంచుతూ జీవో విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ లకు చెందిన వారు, అలాగే అన్ని వర్గాల్లో ఉన్న వితంతువులు, దివ్యాంగులకు 2016 తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు (ఉద్యోగ నిబంధనల చట్టంలో) అనుమతించిన వయో పరిమితి, సడలింపులు కొనసాగుతాయని అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •