ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఐరన్ పెరగడంతోపాటు రక్తహీనత తగ్గాలంటే???

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య వస్తుంది. మన శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి హిమోగ్లోబిన్ చాలా అవసరం కాగా హిమోగ్లోబిన్ తయారుచేయటానికి ఐరన్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది. రక్తహీనత సమస్య కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అందువల్ల రక్తహీనత సమస్యలు లేకుండా చూసుకోవాలి.

అయితే రక్తహీనత సమస్య ఉన్నప్పుడు, ఐరన్ లోపం ఉన్నప్పుడు కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ గుడ్లు,చేపలు, బీన్స్, పాలకూర, మునగాకు, చిలకడ దుంప, బ్రకోలి, బటాని, శనగలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్ అంది రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. మాంసాహారం తినే వారైతే వారంలో రెండు సార్లు తీసుకోవాలి. అప్పుడు రక్తహీనత సమస్య ఉండదు. ఎప్పుడైనా సరే మన ఆహారంలో మార్పులను చేసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •