వార్తలు (News)

గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు!!

గణేష్‌ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్‌లో పోలీసులు ఇవాళ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టంచేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే అంతరాష్ట్ర, జిల్లాల నుంచి లారీల ప్రవేశాలపై నిషేధం విధించారు. నిమజ్జనం దృష్ట్యా నగరంలో తిరిగే ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్లిస్తున్నామని.. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

రేపు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని పోలీసులు ఆదేశించారు. జీహెచ్‌ఎంసీలోని మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్టు, వైన్స్, పబ్‌లు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేస్తున్నట్లు, రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు ఆయా దుకాణాలు మూసివేసి ఉంటాయని స్పష్టంచేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •