హిందూ సంస్కృతిలో పసుపు శుభ సూచకంగా భావిస్తారు. అయితే పసుపు శుభాలను చేకూర్చడమే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. సుపును తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి.

సాధారణంగా పసుపు వంటలలో వినియోగిస్తాము.. కొంత మంది ముఖానికి రాసుకుంటారు కూడా.. అయితే రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు పసుపును పొట్టపై మర్దన చేయడంవల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నాభిపై పసుపు రాసుకునేటప్పుడు కొబ్బరి నూనె కలిపి రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే కడుపులో నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు బాధించవు. పసుపు లో ఫాస్పరస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది.

పీరియడ్స్ సమయంలో స్త్రీలు పొట్టపై పసుపు రాసుకుంటే రుతుస్రావం లో వచ్చే నొప్పిని తగ్గించడానికి పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి నిద్ర పోయే ముందు నాభి పై పసుపు రాసుకుని నిద్ర పోవడం వలన బరువు తగ్గుతారు. వినడానికి ఆశ్చర్యం కలిగించినా ఇది వాస్తవమే. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక రకాల వైరస్లు శరీరం లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. అన్ని రకాల సీజనల్ వ్యాధులను నివారించడానికి పసుపు అద్భుతంగా సహాయపడుతుంది.