ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికిి చెందిన కడప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రోగ్రాం ద్వారా కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం.. మొత్తం ఉద్యోగ ఖాళీలు 18 ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదిగా 2021 డిసెంబర్ 18 ఉంది. విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, ఎంఏ, ఎమ్మెస్సీ సైకాలజీ, బీడీఎస్, ఎంబీబీఎస్ సంబంధిత విభాగాల్లో మెడికల్ పీజీ డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఎక్స్ పీరియన్స్, ఇతర వివరాలను కూడా చూస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.12000 నుంచి రూ.1,10,000 వేతనం చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియ కోసం https://kadapa.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.