దక్షిణ కొరియా వాహన సంస్థ కియా తమ సరికొత్త మోడల్‌ ‘కరెన్స్‌’ను భారతీయుల కోసం గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. 2022 తొలి త్రైమాసికంలో విపణిలోకి ఈ వాహనాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. అధునాతన డిజైన్‌, హైటెక్‌ ఫీచర్లు, ఉన్నత భద్రతా వ్యవస్థ కలగలిపిన ఈ మోడల్‌ను రిక్రియేషనల్‌ వెహికల్‌గా (ఆర్‌వీ) కంపెనీ అభివర్ణిస్తోంది.

కుటుంబ వాహనాల్లో కొత్త విభాగంగా, పరిశ్రమలో సరికొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని కియా కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ హో సంగ్‌ సాంగ్‌ వెల్లడించారు. పెట్రోల్‌, డీజిల్‌ పవర్‌ట్రెయిన్లలో 7-స్పీడ్‌ డీసీటీ, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్లతో, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్‌-వీల్‌ డిస్క్‌ బ్రేకుల వంటి సదుపాయాలు ఈ మోడల్‌ లో ఉంటాయన్నారు. విద్యుత్‌ కార్ల ప్రణాళికను వచ్చే ఏడాది ప్రకటిస్తామని వెల్లడించారు.

మొత్తం 10 భద్రతా ఫీచర్లతో కుంటుంబం మొత్తానికి రక్షణ కల్పించనుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌, ఈఎస్‌సీ, హెచ్‌ఏసీ, వీఎస్‌ఎం, డీబీసీ, బీఏఎస్‌, ఆల్‌-వీల్‌ బ్రేక్స్‌, టీపీఎంఎస్‌ హైలైన్‌ అండ్‌ రేర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌ ఉన్నాయి. ఇవి అన్ని కరెన్స్‌ వేరియంట్లలో అందుబాటులో ఉండడం ఈ మోడల్‌ ప్రత్యేకం.