దోహా నుంచి విజయవాడకు వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తృటిలో తప్పిపోయింది. విమానం ల్యాండ్ అవుతుడగా..  

విమానం రెక్కలు కరెంటు స్తంభాన్ని ఢీకొన్నాయి. విమానం అదుపుతప్పడం వల్లే రెక్కలు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టినట్లు చెబుతున్నారు.  ల్యాండ్ అవుతున్న సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండింగ్ అవుతుండగా.. రెక్కలు ఒరిగిపోవడంతో కరెంటు స్తంభాన్ని ఢీకొన్నాయా..? లేక అదుపుతప్పడం వల్ల ఢీకొన్నాయా అన్నది విచారణలో తేలుస్తామని ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు. చిన్న ప్రమాదం వల్ల ప్రయాణికులకు ఎవరికీ ఏమీ కాలేదని ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు.

ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేలుస్తామన్నారు.