కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు (హైవే ప్రాజెక్టులు) ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుంది.దీనిని కేంద్ర రోడ్డు రవాణ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్ 130 సీడీకి చెందిన కొర్లమ్-కంటకపల్లి సెక్షన్ 6 లైన్ డెవలప్‌మెంట్ పనులకు అంగీకరించింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ విలువ దాదాపు రూ.772.7 కోట్లు ఉంటుందని అంచన. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాయ్‌పూర్- విశాఖపట్నం ఎకనమిక్స్ కారిడార్‌ కింద ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతాయి.
ఎన్‌హెచ్ 130 సీడీకి చెందిన కంటకపల్లి- సబ్బవరం 6 వ లైన్ నిర్మణానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.824 కోట్లుగా ఉంటుంది. ఇంక అనంతపురంలో ఎన్‌హెచ్ 42కు చెందిన 4 లైన్ల అర్బన్ రోడ్డు వెడల్పు పనులకు కూడా కేంద్రం ఓకే చెప్పింది. దీనికి రూ.311 కోట్లు కేటాయించింది.