విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దని కోరుతూ దేశ ప్రధాని మోడీ కి చంద్రబాబు లేఖ రాసారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్లాంట్ ను సాధించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు జీవనాడి అని, దానిని సాధించే పోరాటంలో అనేకమంది అసువులు బాసరని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం 68 గ్రామాల వారు అంటే 16 వేల కుటుంబాల వారు 26 వేల ఎకరాలు ఇచ్చారు. కానీ 8000 కుటుంబాల వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. గతంలో స్టీల్ ప్లాంట్ కు నష్టాలు వచ్చాయని బీఐఎఫ్‌ఆర్‌కు రెఫర్ చేయగా అప్పట్లో AP ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం 1033 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. పునర్నిర్మాణ ప్యాకేజీ తో ప్లాంట్ లాభాల బాట పట్టింది. సొంత గనులు లేకపోవడం వల్లనే స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళింది. దీనికి సొంత గనులు ఏర్పాటు చేస్తే ఆ సమస్య తీరుతుంది. డీటేల్ ప్లాంట్ భూమి రూ.2 లక్ష కోట్ల విలువ చేస్తుంది. స్టీల్ ప్లాంట్ చాలామందికి ఉపాధి కల్పిస్తుంది. దీనిని ప్రైవేటీకరించడం వల్ల అనేకమంది నష్టపోతారు కనుక దీనిని ప్రైవేటీకరించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించవలసిందిగా లేఖలో ప్రధానిని చంద్రబాబు కోరారు.