ఇండియా లో మళ్ళీ పుంజుకుంటున్న కరోనా. కొంచం అదుపులోకి వచ్చిందని ప్రభుత్వాలు,ప్రజలు ఊపిరి పిల్చుకునే లోపు మళ్ళీ అలజడి మొదలయింది. దేశంలో కొంతకాలం గా కోవిడ్ కేసు లు తగ్గుముఖం పట్టినట్టు కనపడినా కూడా గత 22 రోజులలో 14 వేల కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి. గడచిన 24 గంటల్లో 13,993 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ తీవ్రత కేరళ,మహారాష్ట్ర లలో ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా నమోదయిన కేసు ల్లో 75 శతం కేసు లు ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి.
ఇంకా ఎక్కువగా మనం ఆందోళన చెందవలసిన విషయం ఇంకొకటి ఉంది, అది ఏంటంటే కేసులు చాల ఎక్కువగా పెరుగుతున్నప్పటికీ రికవరీ రేట్ మాత్రం చాల తగ్గుతుంది. పంజాబ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి, కానీ కేరళ రాష్ట్రం మాత్రం అందరికన్నా ముందు ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో రోజూవారీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ముంబైలో నిన్న ఒక్క రోజే 13వేల 592మందికి జరిమానా విధించారు. జరిమానాల రూపంలో 27లక్షల 18వేల రూపాయలు వసూలు చేశారు. 2020 మార్చి నుంచి 2021 ఫిబ్రవరి 19వరకు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగినందుకు 15లక్షల 71వేల 679మందికి జరిమానా విధించారు. వారి నుంచి 31కోట్ల 79లక్షల 43వేల 400 రూపాయలు వసూలు చేశారు.ఎన్ని చేసినా కూడా కరోనా మాత్రం రోజు రోజుకి విజృంభిస్తూనే ఉంది. దీనిని అదుపులో పెట్టాలంటే ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు కూడా అన్ని నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి.