ఐపీఎల్ 14వ సీజన్ కోసం ఆక్షన్ జరిగినప్పటి నుంచి హైదరాబాద్‌ సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ పై విమర్శలు మొదలయాయ్యి. టీంలో హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేరంటూ పలువురు విమర్శిస్తున్నారు.
పేరుకే హైదరాబాద్ టీమ్ అయిన ఒక్కడు కూడా లోకల్ ఆటగాడు లేరని భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాదులో జరిగే ఐపిఎల్ మ్యాచులను అడ్డుకుంటామని ఆయన అన్నారు. హైదరాబాదులో సత్తా చాటగలిగే క్రికెటర్లు చాలా మందే ఉన్నారని, సన్ రైజర్స్ హైదరాబాదు జట్టులో ఒక్క హైదరాబాదీ కూడా లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ క్రికెటర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తన జట్టులోకి తీసుకోవాలని, లేదంటే పేరు మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే లోకల్ ప్లేయర్స్ కు కొంత ప్రాధాన్యం ఇవ్వడం మొదటి నుంచి జరుగుతూ వస్తుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లు లోకల్స్‌కు ఎంతోకొంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొన్నటి ఆక్షన్‌లో సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌ను ముంబాయి ఇండియన్ జట్టులోకి తీసుకుంది. అయితే సన్ రైజర్ మాత్రం లోకల్ ఆటగాళ్లను పట్టించుకోవడంపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ఫ్రాంచైజ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.