ఇండోర్: దేశవాళీ టోర్నీ ‘విజయ్ హజారే’ ట్రోఫీ మ్యాచ్‌లో వికెట్ కీపర్ మరియు బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ఇండోర్ వేదికగా జరుగుతున్న ఎలైట్ గ్రూప్ బీ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆడారు. శనివారం మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన కేవలం 94 బంతుల్లోనే 173 రన్స్ చేశారు . భారీ షాట్లతో హోరెత్తించిన ఇషాన్ ఇన్నింగ్స్‌లో మొత్తం 11 సిక్స్‌లు, 19 ఫోర్లు చేసారు. ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ముంగిట ఇషాన్ మెరుపు శతకం గెలుపొంది బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు. కనీసం టీ20ల్లో అయినా చోటు దక్కుతుందో లేదో వేచి చూడవలసిందే !