అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ సోము వీర్రాజు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.హిందుత్వాన్ని పక్కన పెట్టేందుకు విశాఖ ఉక్కు ఉద్యమం తీసుకువచ్చారని చెప్పడం అవివేకం అని ఢిల్లీలో సోము వీర్రాజుకి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు.మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ప్రధాని అధ్యక్షతన ఎకనామిక్స్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగిన విషయం వాస్తవమా కాదా?ఆ మీటింగ్లోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 100% ప్రైవేటుపరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై బీజేపీ కుట్రలను ప్రజలు క్షమించరు అని రామకృష్ణ విమర్శించారు.