టోక్యో: ఇప్పుడు జపాన్ లో మరో కొత్త రకం కరోనా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువులకు వేదికైన జపాన్‌లో ఇప్పటికే ఈ కొత్త రకం కరోనాకి సంబంధించిన కేసులు నమోదయ్యాయట. తూర్పు జపాన్‌లోని కాంటే ప్రాంతంలో 91 కేసులు, విమానాశ్రయాల్లో రెండు కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జపాన్ రాజధాని టోక్యో ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఇన్ఫెక్షన్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. జపాన్‌లో ఇప్పటికే వెలుగు చూసిన కోవిడ్ కేసుల కంటే ఇది భిన్నంగా ఉందని, కనుక ఇది వేరే దేశాల్లో వృద్ధి చెంది ఉంటుందని ఇక్కడి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్ డిసీజెస్ వెల్లడించింది. వ్యాక్సిన్ పనితీరును దెబ్బతీసే E484K మ్యూటేషన్‌ను, ఈ కొత్త రకం కరోనా వైరస్‌లో కనుగొన్నట్లు శాస్త్రజ్ఞులు తెలియజేసారు.