క్రైమ్ (Crime)

డిసిపికి నాగమణికి మధ్య ఫోన్ కాల్ సంభాషణ


పెద్దపల్లి లో హై కోర్ట్ న్యాయవాది నాగమణి హత్య జరిగిన రోజు ఉదయమే వారి భద్రత గురించి ఆందోళనగా డీసీపి రవీందర్ తో మాట్లాడినట్టుగా ఉన్న ఫోన్ సంభాషణ సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.వామనరావు,నాగమణి దంపతులు ఈ నెల 17 వ తేదీన హైదరాబాద్ నుండి మంథనికి వస్తుండగా గుంజపడుగు వద్ద జరుగుతున్న ఆలయ గొడవల విషయం వారికీ తెలియగా దానిపై నాగమణి 100 డయల్ను ఐదు సార్లు సంప్రదించినప్పటికీ స్పందించలేదు.ఆ కారణంగా నాగమణి పెద్దపల్లి డిసిపి కి ఫోన్ చేసారు.


వారిమధ్య జరిగిన సంభాషణ యథాతథంగా మీకోసం :
నాగమణి : సర్ నేను పీవీ నాగమణి హైకోర్టు అడ్వకేట్ని మాట్లాడుతున్నాను.
డిసిపి : నమస్తే చెప్పండమ్మా.
నాగమణి : మా గ్రామంలో గుంజపడుగులో రామాలయం గురించి సిపి సత్యనారాయణ గారికి అనేకసార్లు ఫిర్యాదు ఇచ్చి ఉన్నాము.కానీ ఆయన సకాలంలో స్పందించట్లేదు.
డిసిపి : ఆ ఇష్యూ ఏంటమ్మా?
నాగమణి : కుంట శ్రీనివాస్ అనే వ్యక్తి రామాలయం లోపల,పరిసరాలలోని భీభత్సం సృష్టిస్తున్నారు సర్.హోమం పెట్టుకుంటే కూడా డిస్టర్బ్ చేస్తున్నారు.
డిసిపి : ఆ ఆలయానికి కమిటీ అంటూ లేదా అమ్మా?
నాగమణి : ఉంది కానీ అది కమిటీయే కాదు అని గొడవ చేస్తున్నారు.
డిసిపి : అయితే కోర్ట్ కు వెళ్లండమ్మా.
నాగమణి : సర్పంచ్ గారు స్థానిక పోలీస్లకి ఫిర్యాదు చేసారు సర్
డిసిపి : అమ్మా నామాట విను.ఇది పోలీసులకి సంబందించిన విషయం కాదు.లీగల్గా మీరు గొడవ పడితే అప్పుడు మా క్రింది అధికారులకు మీ విషయం లో జోక్యం చేసుకోవలసిందిగా ఆదేశించడం కుదురుతుంది.ఆ ఫిర్యాదు కూడా గ్రామ సర్పంచ్ చేయాలి .
నాగమణి : ఆలయంలో గొడవ జరిగిందని సీపీకి,సర్పంచ్ కి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ వారు స్పందించలేదు సర్
డిసిపి : అయితే సర్పంచ్ కి చెబుతాము.గ్రామసభలో మీరు తీర్మానం చేసుకుంటే రక్షణ కల్పిస్తామని చెప్తాము.ప్రతి గొడవమేము దగ్గరుండి చూడాలంటే అది కుదిరే విషయం కాదు,ఒక కానిస్టేబుల్ ఉన్న కూడా మేము ఉన్నట్టే!పోలీస్లని ఇందులోకి లాగకండి.
నాగమణి : అంటే గొడవలు అయి మేము చనిపోయిన కూడా పోలీసులు రారా?ఎటాక్ చేసినా, చంపేసిన కూడా ఇంకా అంతేనా?
డిసిపి : గ్రామపంచాయతి సర్పంచ్ చూసుకోవాలి,దానిలో మాకు సంబంధం ఉండదు.దేశంలో ఉన్న అన్ని గుళ్ళకి మేము రక్షణ ఇవ్వాలంటే అది చాల కష్టం.మీరు కూడా అర్ధం చేస్కోండి.ఓకేనా?

ఇదీ వారిమధ్య జరిగిన సంభాషణ. ఈ సంఘటనలో ఎవరి తప్పు ఎంత ఉంది అనుకోవాలి?

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.