భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ ‘షబ్నమ్’ యొక్క 12 ఏళ్ల కుమారుడు రాష్ట్రపతికి తన తల్లి గురించి లేఖ రాశాడు. ఆ లేఖలో ‘మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకు క్షమాభిక్ష పెట్టండి రాష్ట్రపతి అంకుల్‌. ఆమెను ఉరి తీయొద్దు’.. అంటూ విజ్ఞప్తి చేసాడు.
షబ్నమ్ అను మహిళ తమ పెళ్ళికి నిరాకరించారనే కోపంతో 2008 లో ప్రియుడు సలీం తో కలిసి తల్లితండ్రులను, ఇద్దరు సోదరులను, వారి భార్యలను, 10 నెలల వయసు ఉన్న మేనల్లుడిని కూడా హతమార్చింది. షబ్నమ్ అప్పటికే 7 వారాల గర్భవతి కాగా తరువాత కారాగార శిక్ష అనుభవిస్తున్నప్పుడే మగబిడ్డకు జన్మనిచ్చి అతనకి మొహమ్మద్ తేజ్ అని పేరు పెట్టుకుంది.
ఇప్పటికే రాష్ట్రపతికి క్షమాబిక్ష కోసం నిందితులు ఇద్దరు అర్జీ పెట్టగా రాష్ట్రపతి దానిని నిరాకరించడం జరిగింది. ఇప్పడు మళ్ళీ షబ్నమ్ యొక్క కుమారుడు రాష్ట్రపతికి క్షమాబిక్ష కోసం విజ్ఞప్తి చేసాడు. రాష్ట్రపతి సమాధానం కోసం ఇంక వేచిచూడాలి.