పోలవరం మట్టి మాఫియా దెబ్బకి ఒక నిండు ప్రాణం బలి అయింది. మట్టిమాఫియా టిప్పర్ క్రింద పడి ఒక వ్యక్తి మృతి చెందారు. రోడ్డు వెంబడి నడిచి వెళ్ళే వ్యక్తి ని లారీ డ్రైవర్ నేరుగా తొక్కించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన విజయవాడ నగర శివారు గుణదల బైపాస్ రోడ్డులో జరిగింది. మృతుడు నేపాల్ కు చెందిన వ్యక్తిగా బైపాస్ రోడ్డులోని హోటల్ లో కార్మీకుడుగా గుర్తించారు.

టిప్పర్ లారీ డ్రైవర్ అజాగ్రత్త వలనే ప్రమాదం జరిగినట్లు సప్రత్యక్ష సాక్షులు వివరించారు. ప్రమాద దృశ్యాలు సిసి కెమారాలో నిక్షిప్తం అయ్యాయి. సంఘటన స్ధలానికి చేరుకొని గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు.