విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్టులో ఒక నిమిషంలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అవుతుండగా ఎయిరిండియా విమానం అదుపు తప్పింది. రన్వే పక్కనున్న స్తంభాన్ని విమానం రెక్క ఢీకొట్టింది. పైలట్ కన్ఫ్యూజన్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. విమానంలోని 63 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. అయితే ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. వీరందరినీ మరో విమానంలో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో విమాన రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎయిర్పోర్టు అధికారులు మరమ్మతులను వేగవంతం చేశారు.