నిన్న రాత్రి (శుక్రవారం) 7.30 గంటలకి ప్రచారం ముగిసింది. రేపు ఉదయం (ఆదివారం) 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తుది విడత పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తదుపరి ఫలితాలు వెల్లడి అవుతాయి. అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక జరగనుంది.
నాలుగవ విడతకి 13 జిల్లాలలో 161 మండలాలలో మొత్తం పంచాయతీ లు 3299 ఉన్నాయి. సర్పంచ్ ఏక గ్రీవాలు 553 ఉన్నాయి. రేపు ఎన్నికలు జరిగే పంచాయతీ లు 2744 ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థులు మొత్తం 7475 ఉన్నారు. మొత్తం వార్డులు సంఖ్యా 33,435 ఉండగా వాటిలో ఏక గ్రీవాలు 10921 ఉన్నాయి. అలాగే ఎన్నికలు జరిగే వార్డులు ఉండగా 22422 వార్డు అభ్యర్థులు 49,083 ఉన్నారు. నేడు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రి పంపిణీ జరగనుంది. నేటి రాత్రికి ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకి చేరుకోవలసిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసారు.