స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం శ్రీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు శ్రీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఢిల్లీలోనూ పోరాడతాం.జీవీఎంసీ వద్ద గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన శ్రీ విజయసాయిరెడ్డి.జీవీఎంసీ దగ్గర గాంధీజీ విగ్రహం నుంచి ఎంపీ శ్రీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేసారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు.పాదయాత్రలో స్వచ్ఛందంగా విశాఖ నగర వాసులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేసారు. ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కిమీ మేర పాదయాత్ర.కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేట్ ఎదుట సాయంత్రం బహిరంగ సభ.శ్రీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ఏమన్నారంటే..విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట యాత్రకు ఈరోజు నాంది పలకడం జరిగింది. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి. ప్రైవేటీకరణ చేయకూడదని వైయస్ఆర్ సీపీ విధివిధానాలను అనుసరించి మా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలన్ని కలుపుకొని ఈ ఉద్యమాన్ని ప్రారంభించి.. కొనసాగిస్తున్నాం.

ఎటువంటి పరిస్థితుల్లో సంస్థను ప్రైవేటీకరణ చేయడం మా పార్టీ ఆమోదించదు. దానికి గతంలో కూడా చెప్పాం. పార్లమెంట్ లోపల… బయట కూడా ఉద్యమాన్ని పోరాటాన్ని కొనగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం.

కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తున్నారు… మీ పోరాటం ఇక్కడ చేస్తే ఏముంటుంది? ఢిల్లీలో చేయండని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. వారికి నేను చెప్పే జవాబు ఒక్కటే చెప్తున్నా… గతంలో కూడా విశాఖ ఉక్కుని సాధించినప్పుడు అప్పట్లో (1978లో) పోరాటం ఇక్కడే కొనసాగించారు. ఢిల్లీలో కూడా కొనసాగించారు. ఏదైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ విశాఖలోనూ, అక్కడ ఢిల్లీలోనూ పోరాటం సాగించినట్లైతే మనం అనుకున్నది సాధిస్తాం. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు ఏ రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారో వాళ్ళందరిని కూడా కలిసి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను.

మనమందరం కూడా కలిసి పనిచేస్తాం. మనం అనుకున్నది సాధిస్తాం. ప్రైవేటీకరణ అనేదాన్ని నిరోధిస్తాం. ఇది ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగించే వరకు పోరాటం చేస్తాం.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఢిల్లీలోనూ ఇక్కడా రెండు చోట్ల పోరాటం కొనసాగిస్తాం ప్రతి ప్రయత్నం చేస్తాం. శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. తప్పకుండా విజయం సాధిస్తాం అని అన్నారు.