క్రైమ్ (Crime) వార్తలు (News)

ట్యాక్స్ రిఫండ్ ఎస్ఎంఎస్‌లతో జాగ్రత్త

ఆదాయపు పన్ను శాఖ ఇటీవలనే ఫిషింగ్ మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని, ట్యాక్స్ రిఫండ్ ఎస్ఎంఎస్‌లతో అప్రమత్తంగా ఉండాలని పన్ను చెల్లింపుదారులను ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది. ఎస్ఎంఎస్‌లో వచ్చే లింక్స్‌పై క్లిక్ చేయొద్దని తెలిపింది.

న్యూఢిల్లీకి చెందిన సైబర్‌పీస్ ఫౌండేషన్, సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆటోబాట్ ఇన్ఫోసెక్ సంయుక్తంగా చేసిన దర్యాప్తులో దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మరో రెండు ప్రైవేట్ రంగ బ్యాంక్లు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సహా ప్రభుత్వ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB లను మోసగాళ్లు టార్గెట్ చేశారని తేలింది.

ఈ బ్యాంకులకు చెందిన కస్టమర్లకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ అప్లికేషన్ సమర్పించాలని కోరుతూ మోసగాళ్లు ఎస్ఎంఎస్‌లు పంపుతూ మోసపూరిత లింక్స్ పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ కస్టమర్లు వచ్చిన ఎస్ఎంఎస్‌లోకి లింక్‌పైన క్లిక్ చేయడం ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇఫైలింగ్ వెబ్‌సైట్‌ను పోలిన మోసపూర్తి వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. దీని ద్వారా సైబర్ క్రిమినల్స్ బ్యాంక్ కస్టమర్ల వివరాలు తస్కరిస్తున్నారు.
ఈ మోసపూరిత లింక్స్ అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి జనరేట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.