వార్తలు (News)

తెలంగాణ చిన్నతిరుపతి అర్చకులకు కరోనా

తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అర్చకులలో ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో తోటి అర్చకుల్లో, సిబ్బందికి, భక్తుల్లో ఆందోళన నెలకుంది. పదిహేను రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు, ఆలయ అర్చకులకు కరోనా వైరస్ సోకడంతోనే భక్తుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ ఈఓ వంశీ తెలిపారు. ముఖ్యంగా దేవుడికి ధూప దీప నైవేద్యాలు సమర్పించే ఆర్చకులకు కరోనా సోకుతుండటం పట్ల ఆందోళన ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

అయితే స్వామి వారికి చేసే నిత్యపూజలు, అభిషేకాలు యధావిధిగా కొనసాగుతాయని, త్వరలో జరిగే బ్రమ్మో త్సవాలు, స్వామి వారి కల్యాణం ఎలాంటి హంగు ,ఆర్బాటం లేకుండా నిరాడంబరంగా జరిపిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో ప్రత్యక్షంగా భక్తులకు తిలకించే అవకాశం లేకుండా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని, బక్తులు సహకరించాలని ఈఓ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.