అంతర్జాతీయం (International) వార్తలు (News)

ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా పాజిటివ్

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెండు రోజుల కిందటే వ్యాక్సీన్ తీసుకున్నా కూడా కోవిద్ కు గురయ్యారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కీలకమైన సమావేశాలలో పాల్గొంటూనే ఉన్నారు. ఇటీవల రాజధాని ఇస్లామాబాద్‌లో సెక్యూరిటీ సదస్సుకు కూడా హాజరయ్యారు. ఆ సదస్సులో చాలా మంది పాల్గొన్నారని, ఆ సదస్సులో ఇమ్రాన్ మాస్క్ లేకుండానే ప్రసంగించారని, ఆ తరువాత శుక్రవారం నాడు పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టు ప్రారంబోత్సవంలో పాల్గొన్నారని తెలుస్తుంది. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 6,23,135 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ మూలంగా 13,799 మంది చనిపోయారు.

కోవిడ్-19కు కారణమయ్యే వైరస్‌ను ఎదుర్కోగల రోగనిరోధక శక్తిని వ్యాక్సీన్ పెంచుతుంది. కానీ అది మనిషి శరీరం లోపల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. వ్యాక్సీన్ తీసుకున్న వెంటనే కొన్ని వారాల వరకు వైరస్ సోకే అవకాశం ఉంటుంది కాబట్టి నిబంధనలు అన్ని పాటించాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.