విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు పెరిగిన నేపథ్యంలో, విమాన ఛార్జీల కనిష్ఠ పరిమితిని 5 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి శుక్రవారం తెలిపారు. గత నెలలో ఇంధన ధరలు పెరిగిన కారణంగానే దేశీయ విమాన ఛార్జీల గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను కేంద్రం 10-30 శాతం అంటే 40 నిమిషాల కంటే తక్కువ ప్రయాణ సమయానికి కనిష్ఠ పరిమితిని శుక్రవారం నుంచి రూ.2,310కి , 180-210 నిమిషాల ప్రయాణ నిడివిలో అత్యధిక శ్రేణి కనిష్ఠ పరిమితిని రూ.7,560 చేశారు.
ప్రస్తుతం విమానయాన సంస్థలు తమ సామర్థ్యంలో 80 శాతం సర్వీసులు మాత్రమే నిర్వహిస్తున్నాయన్ సంగతి తెలిసిందే!