వార్తలు (News)

తెలంగాణ భవన్ వాణిదేవి ఎమ్మెల్సీ గెలుపు సంబరాల్లో అపశ్రుతి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం అయిన తెలంగాణ భవన్‌లో సురభివాణి గెలుపు సంబరాలు ఉత్సాహంగా జరుపుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి అపశ్రుతి దొర్లడంతో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి గెలవడంతో టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు తెలంగాణ భవన్‌లో మొదలయ్యాయి. కార్యకర్తలు సంబరాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి బాణసంచా కాల్చారు. బాణాసంచా నిప్పు రవ్వలు కాస్తా పైకప్పుపై పడి మంటలు అంటుకోవడంతో మంటలు ఎగిసి పడుతుండడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.