వార్తలు (News)

జీఎస్టీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

హైకోర్టు ధర్మాసనంస్టే విధించడంతో భరణి కమోడిటీస్‌ సంస్థకు ఊరట లభించింది. బకాయిలపై జీఎస్టీ అధికారులు జారీ చేసిన షోకాజ్‌ నోటీ్‌సలపై ధర్మాసనం స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని జీఎస్టీ అధికారులను, వ్యక్తిగత హోదాలో జీఎస్టీ ఎస్పీ శ్రీనివాస్‌ గాంధీ, డిప్యూటీ కమిషనర్‌ జీ.సుధారాణిలను ఆదేశించింది. ఎక్సైజ్‌ చట్టంలో సమూల మార్పులు చేసినా కూడా అధికారులు చట్టాలను గౌరవించడం మానేసి మొరటు పద్ధతులను అనుసరించడంపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసినపుడు.. వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే అవకాశం సదరు సంస్థకు ఇవ్వాల్సి ఉంటుందని, రూ.8.74కోట్ల జీఎస్టీ బకాయిలకు సంబంధించి ఇచ్చిన షోకాజ్‌ నోటీసులపై క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును భరణి కమోడిటీస్‌ ఆశ్రయించడంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ సంస్థ ఎండీ సింగపూర్‌లో ఉండగా జీఎస్టీ అధికారులు ఆయన ఇంటిలో సోదాలు చేశారు. రికార్డులు సీజ్‌ చేసి తీసుకెళ్లడమే కాకుండా, ఆయన భార్యను తీసుకెళ్లి వేకువజాము వరకు కూర్చోబెట్టారని కోర్టుకు వివరించారు. జీఎస్టీ ఎస్పీ శ్రీనివాస్‌ గాంధీ, డిప్యూటీ కమిషనర్‌ జీ.సుధారాణి, అదనపు కమిషనర్‌ ఆనంద్‌కుమార్‌లు రూ.5కోట్లు డిమాండ్‌ చేశారన్నారు. ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను దుర్వినియోగం చేసినట్లు పలువురు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా షోకాజ్‌ నోటీసులు ఇచ్చారన్నారు. వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా తిరస్కరించారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇప్పుడు న్యాయస్థానం స్టే విధించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.