తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీనటి ఖుష్బూ వారి ఆస్తుల వివరాలను పొందు పరుస్తూ ఒక అఫిడవిట్ ను సమర్పించారు. దానిలో తన వద్ద 8.5 కిలోల బంగారం, 78 కిలోల వెండి ఉన్నట్లు, రూ.6.39 కోట్ల చరాస్తులు, రూ.34.56 కోట్ల స్థిరాస్తులు సహా మొత్తం రూ.40.96 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. తన భర్త సుందర్‌ సి వద్ద 495 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నట్లు పేర్కొన్నారు. వారి వార్షిక ఆదాయం రూ.1.50 కోట్లుగా తెలిపారు.