వార్తలు (News)

ఆరు నెలల వ్యవధిలో రెండోసారి వేతనపెంపు – టీసీఎస్‌

టీసీఎస్ తన ఉద్యోగులందరికీ వేతనాలు పెంచనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వేతన పెంపు చేయనున్న తొలి కంపెనీ ఇదే కావడంతో ఆ సంస్థలో పనిచేసే 4.7 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఆఫ్‌షోర్‌ ఉద్యోగులకు సగటున 6-7 శాతం మేర ఇంక్రిమెంటు ఉండొచ్చని, ఆరు నెలల వ్యవధిలోనే 12-14 శాతం మేర సగటు ఇంక్రిమెంటు ఉద్యోగులకు లభించినట్లు అవుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌ 2021 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని ప్రాంతాల ఉద్యోగులకు పదోన్నతులను, ఇంక్రిమెంట్లు ఇచ్చే పనిలో ఉన్నట్లు టీసీఎస్‌ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.