విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో గాజువాకకు చెందిన శ్రీనివాసరావు ఉక్కు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతవుతానంటూ రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తుంది. అది కూడా ఈ సాయంత్రం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న మహాగర్జనకు భంగం కలిగించేవిధంగా ఉంది. ఈ లేఖను, ఐడీ కార్డు, పర్సు, చరవాణి, శ్రీనివాసరావు టేబుల్‌ వద్ద గుర్తించారు. శ్రీనివాసరావు ఉదయం 5గంటల షిఫ్టుకు ప్లాంట్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన కోసం గాలిస్తున్నారు.

లేఖలో ఉన్న విషయాలు ఏంటంటే….
‘‘ ప్రియమైన కార్మిక సోదరులారా.. మనందరం కలసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈరోజు జరగబోయే ఉక్కు కార్మిక మహాగర్జన ఒక మైలు రాయిగా నిలిచిపోవాలి. 32 మంది ప్రాణత్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వొద్దు. నేను నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను. ఈరోజు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి కావడానికి సాయంత్రం 5.49 గంటలకు మహూర్తం. ఈ పోరాటంలో ప్రాణత్యాగం నా నుంచి మొదలు కావాలి. జై హింద్‌’’ అని రాసారు.