వార్తలు (News)

పాఠశాలలోపల బయటపడ్డ సొరంగం

అనంతపురంలో నాడు-నేడు పనులకు సంబంధించి బడి ప్రాంగణంలో ఇటీవల వృథా మట్టిని వేసి చదును చేశారు. ఈ నేపథ్యంలో మూగ, చెవిటి పిల్లలకు బోధన చేసే గోడ పక్కనే శుక్రవారం మధ్యాహ్నం సొరంగం బయట పడింది. వందేళ్లకిందట నగరంలోని మార్కెట్‌ వెనుకవైపున చర్చితో పాటు ప్రాథమిక పాఠశాల కూడా నిర్వహించేవారు. అదే ప్రదేశంలో కాలక్రమేణా నెం.2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా ఏర్పాటుచేశారు. వంద ఏళ్ళ పురాతన పాఠశాల కావడంతో గతంలో ఎప్పుడైనా తవ్వకాలు జరిపారా లేదా బావి ఉంటే మట్టి లోపలకు వెళ్లడంతో గొయ్యి ఏర్పడిందా అన్నది పరిశీలించాలి. పై భాగంలో రెండు అడుగులమేరకు రంధ్రం కనిపిస్తుండగా అంతర్భాగంలో మరింత వెడల్పు ఉంది. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా పెద్ద గ్రిల్‌ అమర్చి బండ అడ్డుగా ఉంచారు. ఇంతకూ మునుపు ఎప్పుడు ఇలా జరగలేదని ప్రధానోపాధ్యాయిని రాజేశ్వరి, ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, నూరుద్దీన్‌ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.