భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వాట్సప్, ఇన్స్టాగ్రామ్ సేవలు రాత్రి 10.45 గంటలకు నిలిచిపోవడంతో అనేక మంది నెటిజన్లు ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో
ఇబ్బందులను వివరించారు. వినియోగదారులు సందేశాలను పంపడం, చదవడం చేయలేకపోయారు. దాదాపు అర గంట తర్వాత ఈ రెండు సామాజిక మాధ్యమాల సేవలు పునరుద్ధరించబడ్డాయి.