క్రైమ్ (Crime) వార్తలు (News)

బీఎంసీ మార్షల్‌పై మహిళ దాడి

కరోనా విజృంభణ దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ) జరిమానా వసూలు చేస్తూ దీనిని అమలు చేసేందుకు మార్షల్స్‌ను కూడా నియమించింది. అయితే ముంబయిలోని కండీవాలీలో మహవీర్‌నగర్‌ లింక్‌ రోడ్డు వద్ద జైనాద్‌ షేక్‌ అనే మహిళ మాస్కు లేకుండా బయటకు వెళ్లడం గమనించిన అశ్విన్‌ గుంజన్‌ అనే మహిళా మార్షల్‌ జైనాద్‌ షేక్‌కు జరిమానా విధించారు. జరిమానా కట్టమని అడిగినందుకు మార్షల్‌పై జైనాద్‌ షేక్‌ దాడి చేసింది. ‘నన్నే ఆపుతావా? నన్నే ముట్టుకుంటావా?’ అంటూ పూనకం వచ్చినట్లు సదరు ఉద్యోగినిపై దాడికి పాల్పడింది. మార్షల్‌ అశ్విని ఫిర్యాదు మేరకు జైనాద్‌ షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.