క్రైమ్ (Crime) వార్తలు (News)

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో యువకుల కిడ్నాప్‌

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో జగర్‌గుండా ప్రాంతంలోని కుందేడ్‌ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను ఈ నెల 18న కొంతమంది నక్సల్స్‌ ఆయుధాలతో గ్రామానికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. అయితే వీరిని కాపాడేందుకు వెళ్లిన బంధువులు కూడా అదృశ్యమయ్యారు.

కిడ్నాప్‌ అయిన యువకులను కాపాడేందుకు నలుగురు వ్యక్తులు అడవిలోకి వెళ్లగా వారు కూడా ఇంతవరకూ తిరిగిరాలేదు. యువకుల కిడ్నాప్‌ ఉదంతాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అపహరణకు గురైన యువకులు ఇటీవల పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ కారణంగానే నక్సల్స్‌ వీరిని కిడ్నాప్‌ చేసి అజ్ఞాత ప్రాంతానికి తీసుకెళ్లి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •