జాతీయం (National) వార్తలు (News)

నేడు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్న మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు కూడా నష్టాలలో మొదలయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 216 పాయింట్ల నష్టంతో 52,336 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 15,691 వద్ద కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణ, కరోనా, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై భయాలు మదుపర్లను వెంటాడుతూ దేశీయంగా ఇంధన, బ్యాంకింగ్‌, టెలికం, ఆర్థిక, లోహ రంగ షేర్లు సూచీలను దెబ్బతీస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, ఐటీసీ, మారుతీ, నెస్లే ఇండియా, పవర్‌ గ్రిడ్‌, బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, , టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •