రివ్యూ రాజా (Review Raja) వార్తలు (News)

ఈ వారం ఓటీటీలో వస్తున్న సినిమాలు!!

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖంపట్టి పరిస్థితులు చక్కబడుతూ థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. కానీ ఎంతమంది ప్రేక్షకులు వస్తారనే అనుమానంతో పలువురు నిర్మాతలు ఓటీటీ వేదికగా తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాల వివరాలు చూద్దాం!

నారప్ప(అమెజాన్ ప్రైమ్ వీడియో):

వెంకటేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘నారప్ప’. ఇందులో ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ ‘అసురన్’కు ఇది రీమేక్. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

‘సార్‌పట్ట'(అమెజాన్ ప్రైమ్ వీడియో): ఆర్య కీలక పాత్రలో పా రంజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సార్‌పట్ట’. పీరియోదికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం కరోనా దెబ్బకు ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ నెల 22న తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల అవుతోంది.

‘ఇక్కత్'(అమెజాన్ ప్రైమ్ వీడియో): విడాకులు తీసుకోవాల్సిన జంట.. అనుకోని కారణాల వల్ల ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది.. అప్పుడు వారిద్దరి మధ్య ఏం జరిగింది.? చివరికి ఏమైంది.? అనే కధాంశంతో సాగే చిత్రం ‘ఇక్కత్’. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈషం ఖాన్, హసీన్ ఖాన్ దర్శకులు.

’14 ఫెరే'(జీ5): విక్రాంత్ మెస్సే, కృతి కర్బందా జంటగా దేవాన్షు సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’14 ఫెరే’. ఇంట్లో వాళ్లను ఒప్పించే క్రమంలో ప్రేమజంట పడే పాట్లు, దానికి కామెడీని జోడించి తీశారు. ఈ సినిమా జూలై 23న జీ5 వేదికగా విడుదల కానుంది.

‘హంగామా 2′(డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌): 2003లో రిలీజైన ‘హంగామా’కు ఈ చిత్రం సీక్వెల్. ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘హంగామా 2’ తెరకెక్కింది. శిల్పాశెట్టి, పరేష్ రావల్, ప్రణీత, మిజాన్ జెఫ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. జూలై 23న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. వీటితో పాటు రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ జూలై 24న ఆహా వేదికగా విడుదల కానుంది.

మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్టు ఇలా ఉంది..

కింగ్‌డమ్: అసిన్ ఆఫ్ నార్త్(జూలై 24, నెట్‌ఫ్లిక్స్)
స్కై రోజో సీజన్ 2(జూలై 23, నెట్‌ఫ్లిక్స్)
ఫీల్స్ లైక్ ఇష్క్(జూలై 23, నెట్‌ఫ్లిక్స్)
ద లాస్ట్ లేటర్ ఫ్రం యువర్ లవర్(జూలై 23, నెట్‌ఫ్లిక్స్)
టెడ్ లాసో సీజన్ 2(జూలై 23, యాపిల్ టీవీ ప్లస్)
హాస్టల్ డేజ్ సీజన్ 2(జూలై 23, అమెజాన్ ప్రైమ్)

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •