టెక్నాలజీ (Technology) వార్తలు (News)

కలికిరి సైనిక్‌ స్కూల్‌లో స్టాఫ్‌ పోస్టుల నోటిఫికేషన్‌!!

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కలికిరిలో సైనిక పాఠశాల కోసం టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని, ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 18 టీజీటీ, ఎల్‌డీసీ, ఎంటీఎస్‌ పోస్టులను భర్తీ చేయనుండగా ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం పోస్టులు: 18
ఇందులో టీజీటీ సోషల్‌ సైన్స్‌ 1, మ్యాథ్స్‌ 1, లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌ 2, ఎంటీఎస్‌ 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అర్హతలు: టీజీటీ పోస్టులకు సిబీఎస్సీ నిబంధనల ప్రకారం అర్హతలు ఉండాలి.

ఎల్‌డీసీ, ఎంటీఎస్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌ పూర్తిచేయాలి. అభ్యర్థులు 21 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 7
వెబ్‌సైట్‌: http://www.sskal.ac.in

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    72
    Shares
  • 72
  •  
  •  
  •  
  •