ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

వచ్చేవారం నుంచి 2-6 ఏళ్ల వయసువారికీ రెండో డోసు ట్రయల్స్‌!!

కొవిడ్‌-19కు సంబంధించి భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకాను 2 నుంచి 18 ఏళ్ల వారిపై పరీక్షిస్తున్న నేపథ్యంలో 2-6 ఏళ్ల వయసు వారికి వచ్చే వారం నుంచి రెండో డోసు టీకా ఇవ్వనున్నారు. 6-12 ఏళ్ల వయసు వారికి ఇప్పటికే రెండో డోసు ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో కరోనా మూడో దశ ఉద్ధృతి చోటుచేసుకోవచ్చన్న అంచనా వేస్తున్న సమయంలో చిన్నారులపై కొవిడ్‌-19 టీకా ఔషధ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఇటీవల పేర్కొన్నారు.

చిన్నారులకు కరోనా టీకా సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఔషధ పరీక్షల్లో భాగంగా చిన్నారులను వయసుల వారీగా బృందాలుగా విభజించారు. ఒక్కో బృందంలో 175 మంది చిన్నారులను ఉంచి వారికి టీకా ఇస్తున్నారు. ఇలా రెండు డోసుల టీకా పొందిన చిన్నారులను పరీక్షించిన అనంతరం ఆగస్టు చివరికల్లా ఔషధ పరీక్షల మధ్యంతర నివేదిక వచ్చే అవకాశమున్నట్టుగా తెలుస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    55
    Shares
  • 55
  •  
  •  
  •  
  •