టెక్నాలజీ (Technology) వార్తలు (News)

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల!!

స్టాఫ్ సెలక్సన్ కమిషన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను పదవతరగతి ఉత్తీర్ణులైన వారి కోసం జారీచేసింది. మొత్తం 25,271 ఖాళీలు ఉన్నాయి. సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ (సిఆర్ పిఎఫ్), బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్( సిఐఎస్ ఎఫ్) వంటి సంస్ధల్లో కానిస్టేబుల్స్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

ధరఖాస్తు చివరి తేదిని ఆగస్టు 31గా నిర్ణయించారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ధరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభమైంది. విభాగాల వారిగా ఖాళీల వివరాలను చూద్దాం!

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 7545 ఖాళీలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 8464 ఖాళీలు, ఎస్ ఎస్ బిలో 3806 ఖాళీలు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ లో 1431 ఖాళీలు, ఏ ఆర్ లో 3785 ఖాళీలు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 240 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2021 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామ్, రివ్యూ మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు ఫీజు- రూ.100 రూపాయలు గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •