టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఎన్​ఎల్​సీ లో 675 అప్రెంటీస్ జాబ్స్.. దరఖాస్తు చేసుకోండిలా!!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వ రంగ పరిధిలోని నవరత్న సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​(ఎన్​ఎల్​సీ) వివిధ విభాగాల్లో 675 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది.

అప్రెంటీస్ చట్టం-1961 కింద ఒక సంవత్సరం పాటు అప్రెంటీస్​గా నియమించుకుంటుంది. ఆ తర్వాత సంస్థ అవసరాలను బట్టి అప్రెంటీస్​ వ్యవధిని పొడిగిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు వారి అర్హత, పోస్టు ఆధారంగా రూ. 8766, రూ. 10,019, రూ.12,524 మేర నెలవారీ స్టైఫండ్​ను అందజేస్తారు.

పోస్టును బట్టి సంబంధిత ట్రేడ్​లో ఎన్​ఎల్​సీవీటీ లేదా డీజీఈటీ గుర్తింపు గల కళాశాల నుంచి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. వీరితో పాటు బీకామ్​, కంప్యూటర్ సైన్స్‌ విభాగాల్లో బీఎస్సీ, బీసీఏ, బీబీఏ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు 2019, 2020, 2021 సంవత్సరాల్లో కోర్సు పూర్తి చేసి ఉండాలి. అంతకు ముందు పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అనర్హులు. అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లకు పైబడి ఉండాలి. అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం అకడమిక్​ మార్కులను బట్టి ఎంపిక చేస్తారు.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఎన్​ఎల్​సీ అధికారిక వెబ్‌సైట్‌ www.nlcindia.in ద్వారా ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 ఆగస్టు 25 సాయంత్రం 5 గంటలలోపు ఆన్​లైన్​లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ కాపీ ప్రింటవుట్​తో పాటు సంబంధిత అకడమిక్​ డాక్యుమెంట్లను జతచేసి ఆగస్టు 30లోపు పోస్ట్ ద్వారా ఎన్‌ఎల్‌సికి పంపించాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •