అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News)

ఆఫ్గన్ క్రైసిస్.. ఇండియాలో డ్రైఫ్రూట్స్‌ ధరలు మరింత ప్రియం ??

కరోనా మొదలైనప్పటి నుండి డ్రై ఫ్రూట్స్ కి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలుసుకున్నారు. ఆహార అలవాట్లను మార్చుకున్నారు. దీంతో డ్రై ఫ్రూట్స్ కి విపరీతంగా డిమాండ్ పెరిగి ధరలు కూడా ఆకాశాన్నంటాయి. ఇప్పడు దానికి ఆఫ్గన్ క్రైసిస్‌ కూడా తోడైంది. దీంతో ఒక్కొక్క ఐటెం మీద రెండు నుండి మూడు వందల రూపాయల వరకు ధర పెరిగింది.

అంజీర్, కిస్ మిస్, బాదం, పిస్తా, వాల్ నట్స్, ఆప్రికాట్, కుంకుమపువ్వు వంటి వాటికి భారత మార్కెట్లో విపరీతమైన మార్కెట్ ఉండడంతో ఆఫ్గన్ నుంచి దిగుమతి చేసుకుని మరీ కొంటారు. ఆఫ్ఘన్ లో మంచి క్వాలిటీ ఉన్న డ్రై ఫ్రూట్స్ దొరకడంతో అందరూ ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు ఆఫ్ఘన్ ను తాలీబన్స్ ఆక్రమించడంతో వీటి ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం కిలో అంజీర్ 1280, బాదం 1290, వాల్ నట్స్ 1300 రూపాయలు పలుకుతున్నాయ్. అదే వారం క్రితం 700 నుంచి 800 రూపాయలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం నడుస్తోన్నది ఆఫ్గనిస్థాన్ అంతర్గత వ్యవహారం మాత్రమే కాదు. అక్కడి స్థితిగతులు మన దేశ ఆర్ధిక ఆరోగ్య పరిస్థితుల మీద కూడా ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •