టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

వరమహాలక్ష్మి వ్రతం లో కలశం ఏర్పాటు ఎలా చేయాలి?

ఈ సంవత్సరం వరలక్ష్మి పండుగ కోసం అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి. వరలక్ష్మి పూజ చాల నిష్టగా చేయాలి. అమ్మవారు స్వచ్ఛతను కోరుకునే దేవత. లక్ష్మి తన పూజలో ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించదు. ముఖ్యంగా లక్ష్మిని ఇంట్లో ప్రతిష్టించినప్పుడు ఆరాధన సంపూర్తిగా ఉండాలి, కలశం ఏర్పాటు చేయాలి. వ్రతం అంటే ఒక దేవుణ్ణో దేవతనో ఆహ్వానించి కొంతకాలంపాటు ఆరాధించే పద్ధతి. ఇది కొనసాగింపు పూజా విధానం కనుక అది పూర్తయ్యేవరకు ఆరంభంలో ఉంచిన కలశం కూడా ఉంటుంది. ఈ కలశం వ్రతకాలం మొత్తానికి గుర్తుగా ఉంటుంది. అదే కలశం లేకుండా చేసే పూజ అయితే లక్ష్మీ పూజ చేసుకుంటే సరిపోతుంది. నెలమొత్తంగా విధివిధానంగా పూజ చేయడానికి కుదరనివారు కలశరహితంగా చేసుకోవడం ఉత్తమం. అందువల్ల ఎప్పుడైనా అవాంతరం వచ్చినా మనసు అసంతృప్తి కి లోనవకుండా ఉంటుంది.

కలశం అమ్మవారికి ప్రతిరూపం. కలశ పాత్రగా మట్టి పాత్రనుగాని, వెండి, బంగారు, రాగి, పంచలోహపాత్రలను గాని వినియోగిస్తారు. లోహమైనా మట్టి అయినా అది పృథ్వీతత్తానికి సంకేతం. అందులో పోసే నీరు జలతత్తానికి సంకేతం. అందులో కలశాన్ని పూర్తిగా నీరుతో నింపం కనుక శూన్యస్థితి ఆకాశతత్తానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్తానికి సంకేతం. దాని ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం. అంటే అమ్మవారు పంచభూతమయి కనుక కలశ స్థాపనతో పంచభూతాలను ఒకచోటికి చేర్చి ఆరాధించడం ఆనవాయితీ!

కలశం కోసం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడిగి తర్వాత దానికి పసుపు, కుంకుమలతో అలంకరించి బియ్యంపోసి వేదికను సిద్ధం చేయాలి. వేదికను పూలు, చందనం, పరిమళ ద్రవ్యాలు జల్లి శోభాయమానంగా చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని దానిపై అమర్చాలి. దానికి తాంబూలం సమర్పించి ఆరాధించాలి. కలశంలో నీరుపోసి మామిడాకులు కానీ, తమలపాకులు కాని అందులో వేయాలి. ఆకులు ఏవైనా అవి నిటారుగా నిలిచేటట్టు చూసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ నుంచి దానికి రవికెల గుడ్డను వస్త్రంగా చుట్టాలి. కొబ్బరికి ముఖస్వరూపం వచ్చేలా కళ్ళు ముక్కు, పెదవులు, కనుబొమలు అమరేలా దిద్దవచ్చు లేదా అమ్మవారి రూపును దానికి తగిలించి ఆకారం ఏర్పరచవచ్చు. దానికి తమకు తోచిన నగలు వగైరాలు అలంకరించవచ్చు.

పూజ సామాగ్రి:
బియ్యం
5 లేదా మామిడి ఆకు 5
జీడిపప్పు, ద్రాక్ష 5
పొడి ద్రాక్ష 5
నాణేలు 5
పసుపు మరియు కుంకుమ
చిన్న బ్లాక్ పాంథర్ (లక్ష్మీ మెటీరియల్)
ఖర్జూరం1
గోమతి చక్రం 8
బాదం 8
జీడిపప్పు 8
బంగారం వస్తువు
వెండి వస్తువు
ముత్యం , పగడం
5 రకాల ధాన్యం
ఒక నిమ్మరసం
మామిడి ఆకు

పై వస్తువులలో కనీసం 8 వస్తువులను ఉపయోగించాలి, వెండి వస్తువులను తప్పనిసరిగా పేర్చాలి. వరమహల్లక్ష్మి ఇంట్లో ఐశ్వర్య స్వరూపిని ప్రతిష్టించాలంటే, ద్వంద్వత్వాన్ని ఉపయోగించవద్దు, ఇది దురదృష్టానికి సంకేతం. లక్ష్మిని బంగారు ఆభరణాలతో అలంకరించాలి. నకిలి తాళి వద్దు. మీరు లక్ష్మీ కలశం మెడ దగ్గర తొమ్మిది పోగులతో తయారుచేసిన పసుపు తీగను తయారు చేసి దానికి పసుపు కొమ్మును కట్టాలి. మీరు ఏ కారణం చేతనైనా వీటిని మర్చిపోకూడదు.

తామరపువ్వులంటే లక్ష్మీదేవి చాలా ఇష్టం, మరియు తామర పువ్వులు లక్ష్మీ పూజలో ఉంటే, చాలా శుభప్రదం. తులసిని ఉపయోగించకుండా లక్ష్మీదేవి పూజ పూర్తి కాదు, తులసి చాలా గొప్పది. లక్ష్మిదేవికి అలంకరించే పువ్వులలో ఎర్ర మందారం కూడా ఇష్టం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •