జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

యుద్ధ విమానాల కోసం కొత్త టెక్నాలజీ.. డీఆర్‌డీఓ ఆవిష్కారం??

శత్రు రాడర్ల నుంచి భారత వైమానిక దళం(ఐఎఎఫ్) యుద్ధ విమానాలను రక్షించడం కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) అత్యంత శక్తివంతమైన, అధునాతనమైన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ(హెచ్ఈఎంఆర్ఎల్) సహకారంతో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని డీఆర్‌డీఓ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. భారత యుద్ధ విమానాలు ఆకాశంలో ప్రయాణించేటప్పుడు శత్రువుల మిసైల్స్ ను తప్పుదోవ పట్టించడానికి ఈ టెక్నాలజీ ఒక డెకాయ్ గా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ ఇప్పటికే ప్రయోగ దశను దాటి వినియోగానికి సిద్ధం గా ఉంది.

ఆధునిక రాడార్ టెక్నాలజీ కాలంలో మన యుద్ద విమానాలను రక్షించడానికి ఇలాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టినట్లు, ఇది ఆత్మనీర్భర్ భారత్ దిశగా మరో ముందు అడుగు అని,
ఐఎఎఫ్ ను మరింత బలోపేతం చేసే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు రక్షణ శాఖ కార్యదర్శి ఆర్ అండ్ డీ, డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ జీ.సతీష్ రెడ్డి బృందాలను అభినందిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేసారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •